Thursday, July 23, 2026

అందరికి నా శుభాకాంక్షలు!  స్నేహితులు మరియు చుట్టాలు మా అమ్మగారు చేసిన వంటలు తిని, సంతోషించి రెసిపీస్ వ్రాయమని కోరితే, 2007 సంవత్సరము లో మా అమ్మగారు తెలుగు వంటలు తెలిసిన వారిని మనసులో పెట్టుకొని ఈ వంటకాలు వ్రాసారు.  ఆ వంటకాలని వారి బంధువులు 2009 సంవత్సరము లో ఇంగ్లీషులోకి ట్రాన్సలేట్ చేసి ఈ బ్లాగ్ ని పబ్లిష్ చేసారు.   

పల్లెటూర్లో పుట్టి పెరిగి, చిన్నతనములో వివాహము చేసుకొని, అత్తగారు మామగారులతో పెద్ద కుటంబులో కలిసి మెలిసి ఉంటూ తన పర బేధము లేక అందరిని ఆదరించే వారు. ఆవిడ కళలు ఒకటి రెండు కావు, వాటిల్లో వంట ఒకటి. పిల్లలకి రెడీమేడ్ డ్రెస్సెస్ కన్నా గొప్పగా కుట్టేవారు. వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకొన్నారు, పూవులు పండ్ల తోటలు పెంచేవారు, ఇంగ్లీష్ మాట్లాడడం, ఈత కొట్టడం, పాలు పితకడం, కార్ డ్రైవింగ్ లాంటివి నేర్చుకొన్నారు.  పూజలు, పండగలు, పూర్వ ఆచారాలు పద్ధతులు పాటిస్తూ, ప్రోగ్రెస్సివ్గా క్రొత్త విషయాలు తెలుసుకొంటూ, తన వయసువారు  పట్నవాసాలలో పుట్టి పెరిగి చదువుకొన్న వారికంటే ముందుగా  కంప్యూటర్, ఇంటర్నెట్, ఈమైల్ వాడడం మొదలుపెట్టేరు.   ఎన్నో రకాల విద్యలు స్వంతముగా నేర్చుకొని పెనుపొందారు.  

అందరికి మంచి జరగాలని ఆశిస్తూ చెయ్యగలిగిన దానికన్నా ఎక్కువ చెయ్యడానికి ప్రయత్నిచేవారు. ఊరి ఉన్నతికి, ఆపదలో ఉన్నవారికి చేయూత ఇవ్వడానికి ముందుకి వచ్చే వారు. గ్రామ సభ్యులు అందరు కలిసి మెలిసి ఉండే అవకాశాలు కల్పించేవారు.   మహిళా మండలి, చిత్ర కళలు, యోగ, వన భోజనాలు, స్వచ్ఛ గ్రామాలూ, పాటసాలభివృద్ధి, ఆడవారి వృద్ధికి ఆరోగ్యానికి పనికివచ్చే విషయాలు వగైరా నేర్పే వారిని రప్పించే వారు.  

తెలుగు వంటలు, ఊరగాయలతో ఆగకుండా, ఇతర రాష్ట్రాల వంటలు మరియు ఇంటర్నేషనల్ వంటలు (ఇటాలియన్, మెక్సికన్, చైనీస్, మెడిటరేనియన్ లాంటివి కూడ) తనంతట తాను నేర్చుకొని చేసేవారు.  టమాటో కెచప్, రకరకాల జామ్స్, ఫ్రూట్ డ్రింక్స్, కేక్స్, బిస్కెట్స్, ఐస్మ క్రీమ్స్, సూప్స్, మరి ఎన్నో దుకాణాలలో కొనడం అన్నది తెలియదు.  జన్మంతా అన్ని రుచి కరమైన వంటకాలు చేసి ప్రేమతో అందరితో పలు పంచుకొని ఆనందించేవారు.  

అమ్మగారు నాకు వంట నేర్పలేదు, కానీ ఆ వంట మంచి రుచులు మరువులేకుండా నాలో పాతుకి పోయేటట్లు తినిపించారు! ఇది అమ్మగారి జనపార్ధం లో అప్డేట్ చేయసాను.